Tuesday, November 26, 2024

వాహనదారులకు శుభవార్త… ఆటో ఇన్సూరెన్స్‌లో సరికొత్త నిబంధనలను తీసుకువచ్చిన ఐఆర్‌డిఐ..

మోటార్‌ ఇన్సురెన్స్‌ పాలసీ కింద ప్రతి యేడాదీ క్రమం తప్పక చెల్లించే పాలసీల నిబంధనలలో సడలింపులు తెస్తూ ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఐఆర్‌డిఐ) ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక ఆధారితమైన యాడాన్‌ పాలసీలను మోటార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల కోసం ప్రవేశపెట్టడానికి భీమా కంపెనీలకు అనుమతినిచ్చింది. ఈ పాలసీల ఆధారంగా వాహనదారులు ప్రతి ఒక్క వాహనానికీ ప్రత్యేకంగా ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, తమ సొంతవైన పలు వాహనాలన్నింటికీ కలిపి ఒకే ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించేలా సింగిల్‌ యాన్యువల్‌ ప్రీమియం పేమెంట్‌ అయిన ఫ్లోటర్‌ పాలసీని కొనుగోలు చేసుకోవచ్చు. ఎన్ని వాహనాలున్నాయనే దానిమీద ప్రీమియం చెల్లింపులు ఆధారపడి ఉంటాయి.

అంతే కాకుండా వాహనదారులు మోటార్‌ సైకిల్‌ లేదా కారు వంటి వాహనాల వాడకం, డ్రైవింగ్‌ హిస్టరీలను, వాహనం ప్రయాణించే దూరాన్ని బట్టి మాత్రమే ప్రీమియం ధర చెల్లించే సౌలభ్యాన్ని కల్పించింది. అంటే వాహనాలను వాడకం ప్రకారం మాత్కమే ఇన్సూరెన్స్‌ చెల్లించుకునేలా అనుమతులిచ్చింది. అయితే ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తే అత్యధిక ప్రీమియం చెల్లించాల్సుంటుంది. అందుకు వాహనాలలో చిన్న పరికరాన్ని అమర్చి, లేదా వాహనదారుని చారవాణిలో ఇన్స్టాల్‌ చేసిన అప్లికేషన్‌ సాయంతో వాహనాన్ని నడిపే విధానాన్ని జిపియస్‌ ద్వారా సంబంధిత ఇన్సురెన్స్‌ అధికారులు మానిటర్‌ చేయనున్నట్లు తెలిపారు. దాని ఆధారంగానే డ్రైవింగ్‌ స్కోరుని ఇచ్చి ఇన్సురెన్సుని నిర్ణయిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement