Friday, November 22, 2024

ఎంఎంటీఎస్‌ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : జంట నగరాల్లో ప్రముఖ సబ్‌అర్బన్‌ రైలు సర్వీస్‌ అయిన మల్టిమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌(ఎంఎంటీఎస్‌) ఫస్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ జర్నీ చేసే ప్రయాణీకులకు 50శాతం చార్జీలను తగ్గిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ త్గగింపు మే 5నుంచి అమలు జరపనున్నన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్లలోని సబ్‌ అర్బన్‌ రైళ్లలో ప్రయాణించే సింగిల్‌ జర్నీ ప్యాసింజర్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది. కోవిడ్‌ కాలంలో ఎంఎంటీఎస్‌ రైళ్లను పూర్తిగా నిలిపి వేసిన దక్షిణ మధ్య రైల్వే జూన్‌ 2021 నుండి దశల వారీగా సర్వీసులను ప్రారంభించింది. మొదటి రెండు దశల కోవిడ్‌ విజృంభణ తర్వాత 2022 ఏప్రిల్‌ 11నుంచి పూర్తిస్థాయిలో 86 ఎంఎంటీఎస్‌ రైళ్ల నడుపుతోంది.

ప్రయాణీకులకు ఎంతో మేలు – అరుణ్‌ కుమార్‌ జైన్‌..

దక్షిణ మధ్య రైల్వే భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ ఎంఎంటీఎస్‌ సబ్‌ అర్బన్‌ రైలు సర్వీస్‌లో ప్రయాణించే వారికి 50శాతం చార్జీలను తగ్గించడం వల్ల ప్రయాణీకులకు ఎంతగానో మేలు చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. ఎంఎంటీఎస్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ – హైదరాబాద్‌, సికింద్రాబాద్‌- ఫలక్‌నుమా, రామచంద్రాపురం- లింగంపల్లి వరకు 29 రైల్వేస్టేషన్లను కవర్‌ చేస్తూ 50కి.మీ. మేర పరిధిలో సర్వీసులను నడుపుతుందని తెలిపారు. ఈ తగ్గింపుతో ఎంఎంటీఎస్‌కు పూర్వ ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement