Tuesday, November 26, 2024

Hyderabad : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఇకపై వాట్సాప్ నుంచే టికెట్ బుకింగ్స్.. ప్రాసెస్ ఇదిగో..

యాణికుల అవసరాలను పరిగణలోకి తీసుకుంటూ.. ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోన్న హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పుడు మరో ఆకర్షిణీయమైన వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరవాసులను మెట్రో ప్రయాణానికి ఆకర్షించేందుకు మెట్రో యాజమాన్యం.. ఇప్పటివరకు టికెట్ ధరల విషయంలో పలు ఆఫర్లు తీసుకురాగా.. ఇప్పుడు ఆ టికెట్ బుకింగ్ విషయంలో ఆకర్షణీయమైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. వాట్సాప్ ఈ-టికెటింగ్ ద్వారా ఎండ్ టూ ఎండ్ డిజిటల్ చెల్లింపుతో మెట్రో టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభించింది.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు ఇక నుంచి వాట్సాప్‌లోనూ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం పేటీఎంలో టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అధికారులు మరింత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం తీసుకొచ్చారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ వాట్సాప్ కామన్ కావడంతో టికెట్లు కోసం ఇకపై క్యూలో నిల్చునే బాధ తప్పినట్టే. దేశంలోనే తొలిసారి తాము ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు.

దేశంలోనే మెట్రో రైల్ వాట్సాప్ టికెటింగ్ ప్రారంభించడం ఇదే తొలిసారి అని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్ అండ్ టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ మెట్రో రైల్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కోసం సింగపూర్‌లోని Billeasy, AFC భాగస్వామి ShellinfoGlobalsgతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ సరికొత్త సర్వీస్ హైదరాబాద్ మెట్రో రైల్‌లో నిత్యం ప్రయాణించే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికులు ఇప్పుడు తమ వాట్సాప్ నంబర్‌లో ఈ-టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ టికెట్లను ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల వద్ద స్కాన్ చేసి హాయిగా జర్నీ చేయవచ్చు. ఈ సౌకర్యం టిక్కెట్ బుకింగ్ ఇతర డిజిటల్ మోడ్‌లకు అంటే టీ సవారీ, పేటీఎం లాంటి ఇతర ఆఫ్షన్స్ కు అదనంగా నిలవనుంది.

వాట్సాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే ప్రక్రియ:
1) హైదరాబాద్ మెట్రో రైల్ ఫోన్ నంబర్ 918341146468కి ‘హాయ్’ సందేశాన్ని పంపడం ద్వారా WhatsApp చాట్‌ని ప్రారంభించండి లేదా మెట్రో స్టేషన్‌లలో అందుబాటులో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయండి.
2)ఆ తర్వాత OTP, ఇ-టికెట్ బుకింగ్ URL మెసేజ్ రూపంలో వస్తుంది.
3)ఆ తర్వాత E-టికెట్ గేట్‌వే వెబ్‌పేజీని తెరిచి eTicket బుకింగ్ URLని క్లిక్ చేయాలి.
4) అనంతరం జర్నీ రూట్ & జర్నీ టైప్ ఎంపికలను ఎంచుకోవాలి. ఆ తర్వాత పేమేంట్ చేయాలి. (Gpay, PhonePe, Paytm & Rupay డెబిట్ కార్డ్ మొదలైనవి)
5) అనంతరం రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్‌లో మెట్రో ఇ-టికెట్ QR కోడ్ వస్తుంది.
6 )AFC గేట్ వద్ద QR E-టికెట్‌ను స్కాన్ చేసి, హాయిగా జర్నీ చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement