ఎల్ఐసీ పాలసీదారులకు ఆ సంస్థ తీపి కబురు అందించింది. లాప్స్ అయిపోయిన పాలసీలను మళ్లి కొనసాగించేందుకు అవకాశం కల్పించింది. అయితే కొన్ని పాలసీలకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. మొత్తం ప్రీమియం ఆధారంగా టర్మ్ అస్యూరెన్స్, హై రిస్క్ ప్లాన్లు కాకుండా మిగిలిన వాటికి మాత్రమే ఆలస్య రుసుముతో రాయితీని అందిస్తున్నట్టు తెలిపింది. దీంతో పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవచ్చు. ల్యాప్స్ అయిన పాలసీల ప్రీమియంను బట్టి సంస్థ రాయితీలు అందిస్తున్నది. రూ.లక్ష వరకు చెల్లించినట్టయితే ఆలస్య రుసుములో 20 శాతం ఎల్ఐసీనే భరిస్తుంది.
రాయితీ గరిష్ట పరిమితి రూ.2000 మాత్రమే ఉంటుందని వివరించింది. రూ.1లక్ష నుంచి రూ.3లక్షల వరకు ప్రీమియం చెల్లిస్తే.. ఆలస్య రుసుములో 25 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నది. దీని గరిష్ట పరిమితి రూ.2500. రూ.3లక్షల కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించినట్టయితే.. ఆలస్య రుసుములో 30 శాతం వరకు రాయితీ పొందొచ్చు. దీని గరిష్ట పరిమితిని రూ.3000గా ఎల్ఐసీ నిర్ణయించింది. మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ల పునరుద్ధరణ ఆలస్య రుసుములో 100 శాతం రాయితీని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ అవకాశం మార్చి 25 వరకు మాత్రమే అని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..