దేశంలోని దిగ్గజ టెలికం కంపెనీ రిలయన్స్ జియో తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. 5జీ సేవలను విస్తరించింది. దీంతో మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటు-లోకి రానున్నాయి. రిలయన్స్ జియో సంస్థ 5జీ సర్వీసులను ఇవాళ లాంఛనంగా ప్రారంభించింది. రాజస్థాన్ రాష్ట్రం రాజ్‌సమంద్‌లోని ప్రతిష్ఠాత్మక శ్రీనాథ్‌జీ ఆలయంలో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చేతుల మీదుగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో త్వరలోనే 5జీ సేవలు అందుబాటు-లోకి రానున్నాయి. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ఈ ఏడాది పూర్తయ్యే లోపల అందుబాటులో తీసుకురావడమే రిలయన్స్ జియో కంపెనీ లక్ష్యం అన్నారు. 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెటవర్క్‌ను అందించడమే తమ ఉద్దేశమని రిలయన్స్ ఇండస్ట్రీస్ర్ చైర్మన్ ముకేశ్ అంబానీ గత ఆగస్టులో ప్రకటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement