రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చిన భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్. విద్యార్థుల గత విద్యా సంవత్సరాలను కోల్పోకుండానే రష్యన్ విశ్వవిద్యాలయాలు ప్రవేశం కల్పిస్తాయని న్యూఢిల్లీలోని రష్యన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన 20వేల మంది విద్యార్థుల భవితవ్యంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రతిస్పందనగా ఆయన ఈ ప్రకటన చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.