అమెరికాలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న భారత విద్యార్ధులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ అనుమతి కోసం విద్యార్ధుల దరఖాస్తులను త్వరగా పరిశీలించేందుకు వీలుగా ప్రీమియం ప్రాసెసింగ్ విధానాన్ని తీసుకు వస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ఆఫ్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ), సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్, ఇంజినీరింగ్ రంగాల్లోని (ఎస్‌టీఈఎం) ఎఫ్-1 విద్యార్ధులు ఓపీటీ, ఓపీటీ పొడిగింపు కోసం ప్రీమియం ప్రాసెసింగ్ విధానంలో దరఖస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
కొన్ని కేటగిరీల విద్యార్ధులకు మార్చి 6 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మిగిలిన వారు ఏప్రిల్ 3నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌పీఐఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇంటర్నేషనల్ విద్యార్ధులకు ముఖ్యంగా భారత్ విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని భావిస్తున్నారు. ఓపీటీ అనుమతి కోసం సుదీర్ఘకాలం వేచిచూస్తు ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులకు ఇది నిజంగానే గూడ్ న్యూస్.
ఎఫ్-1 వీసా విద్యార్ధులకు ఉపయోపడుతుందని ఒక ఎన్‌ఆర్‌ఐ అభిప్రాయపడ్డారు. ప్రీమియం ప్రాసెసింగ్ కోసం అభ్యర్ధించాలనుకునే వారు ఫారమ్ 1-907 ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రీమియం ప్రాసెసింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంప్లాయిమెంట్ అథంటికేషన్ కోరుకునే ఎఫ్-1 వీసా విద్యార్ధులకు ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.ఇప్పుడు ఎఫ్-1 వీసా ఉన్న విద్యార్ధులు త్వరగా ఎంప్లాయిమెంట్ అథంటికేషన్ పొందడంలో సహాయపడుతుంది.