బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి.. గత కొన్ని నెలలుగా భారీగా బంగారం ధరలు పెరిగాయి. దీంతో కొనుగోలు చేయాలంటేనే బంగారం ప్రియులు భయపడాల్సిన పరిస్థితి. రికార్డు స్థాయిలో ధరలు పెరగడంతో కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గింది. తాజాగా బంగారం ధరలు దిగివచ్చాయి. నేడు (శనివారం) భారీగానే బంగారం, వెండి ధర దిగొచ్చింది. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.400 మేర తగ్గి రూ.రూ.50,900కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.55,530గా ఉంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. కిలో వెండిపై రూ.1000 తగ్గింది. నేడు కిలో వెండి ధర రూ. 71,000గా ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement