Friday, November 22, 2024

Zomato | మ‌హిళా డెలివరీ పార్టనర్స్ కు గుడ్ న్యూస్.. భీమా పాల‌సీ ప్రక‌టించిన జొమాటో..

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజ సంస్థ అయిన జొమాటో, తమ మహిళా డెలివరీ పార్టనర్స్ కు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. తమ కంపెనీలో పని చేసే మహిళా డెలివరీ పార్టనర్స్ కోసం కాంప్రహెన్సివ్ మెటర్నిటీ ఇన్సూరెన్సు పాలసీని అందించనున్నట్లు జొమాటో ప్రకటించింది. ఈ మెటర్నిటీ ఇన్సూరెన్సు పాలసీ అనేది గర్భధారణకు సంబంధించిన ఖర్చులు కవర్ చేయడంతో పాటు డెలివరీ సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే, అలాంటి సందర్భంలో అయ్యే హాస్పిటల్ ఖర్చులను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది. దీంతో మహిళా డెలివరీ పార్టనర్స్ కుటుంబాలపై ఎలాంటి ఆర్ధిక భారం పడకుండా ఇది ఆర్ధిక భద్రతను అందిస్తుంది.

ఈ బీమా పాలసీలో భాగంగా నార్మల్ డెలివరీకి రూ.25,000 వరకు, సిజెరియన్ ఆపరేషన్స్ కు రూ.40,000 వరకు, గర్భస్రావం, అబార్షన్ వంటి సమస్యలకు రూ. 40,000 వరకు కవరేజ్ ను కంపెనీ అందిస్తుంది. అలాగే ఈ పాలసీ అనేది ఇద్దరు పిల్లల వరకు కవరేజ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. తమ కంపెనీ కోసం పని చేసే మహిళా డెలివరీ పార్టనర్స్ కు వివిధ రకాల ప్రయోజనాలను అందించడానికి కంపెనీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని జొమాటో డెలివరీ సీఈవో అయిన రాకేష్ రంజన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement