Tuesday, November 19, 2024

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఓ కాలేజీ నుంచి మరో కాలేజీకి బదలీకి అనుమతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జేఎన్‌టీయూ పరిధిలో ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఒక కళాశాల నుంచి మరొక కళాశాలకు మారాలనుకునే విద్యార్థులకు వర్సిటీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. విద్యార్థులు బదిలీ అయ్యేందుకు అనుమతిస్తూ జేఎన్‌టీ-యూహెచ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి, ఒక యూనివర్సిటీ నుంచి మరో యూనివర్సిటికి, ఒక అటానమస్‌ కాలేజీ నుంచి మరోక నాన్‌ అటానమస్‌ కాలేజీకి బదిలీ అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఇలా రకరకాల పద్ధతిలో బదిలీలు కోరుకునే విద్యార్థులు కారణాలను చూపుతూ, పలు షరతులు విధించింది. విద్యార్థుల బదిలీలు అనేక కారణాలతో ముడిపడి ఉంటాయని తెలిపింది.

అందులో ప్రధానంగా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని పేర్కొన్నది. ఇలాంటి సందర్భంలో విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం స్టూడెంట్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యే వెసులుబాటును కల్పించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి ఈ ఏడాదిలో స్టూడెంట్‌ ట్రాన్స్‌ఫర్ల కోసం అనుమతులు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు అన్ని అఫిలియేషన్‌, అటానమస్‌ కాలేజీలతో పాటు యూనివర్సిటీ కాలేజీలకు కూడా వర్తించనున్నాయని ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ నిబంధనలు వెంటనే అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

- Advertisement -

ఫస్టియర్‌కు రూ.10 వేలు, సెకండియర్‌కు రూ.15వేలు..

అయితే బదిలీలు కావాలనే విద్యార్థులు నిర్ణీత ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఫస్టియర్‌ నుంచి ఫస్టియర్‌కు బదిలీ కావాలనుకుంటే రూ.10 వేలు చెల్లించాలి. సెకండియర్‌ నుంచి సెకండియర్‌కు రూ.15 వేలు, థర్డ్‌ ఇయర్‌ నుంచి థర్డ్‌ ఇయర్‌కు రూ.20 వేలు, ఫోర్త్‌ ఇయర్‌ నుంచి ఫోర్త్‌ ఇయర్‌కు రూ.25 వేల చొప్పున బదిలీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొననారు. అయితే ఈ మేరకు ఆయా కాలేజీ యాజమన్యాలు తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement