సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న ఆ జట్టు ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ఐపీఎల్ ఆడనున్నాడు. ఆలస్యంగా అయినా.. దీపక్ చాహర్ ఐపీఎల్‌లో అడుగుపెట్టనున్నాడు. ఏప్రిల్ రెండో వారం నుంచి దీపక్ చాహర్ సీఎస్‌కే తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ముందుగా అనుకున్న విధంగా దీపక్ చాహర్‌కు సర్జరీ అవసరం లేదని బెంగళూరులోని ఎన్‌సీఏ వైద్యులు నిర్ధారించారు. దీపక్ చాహర్‌ను మెగా వేలంలో.. రూ.14కోట్లు వెచ్చించి సీఎస్‌కే దక్కించుకుంది. అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో చాహర్‌ది రెండో స్థానం.
గత సీజన్‌లోనూ దీపక్ సీఎస్‌కే తరఫునే ఆడాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో చాహర్ గాయపడ్డాడు. తొడ కండరాల గాయానికి గురయ్యాడు. తీవ్రత ఎక్కువ ఉండటంతో సర్జరీ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. మరికొన్ని రోజుల్లో దీపక్ చాహర్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఐపీఎల్‌లో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూరత్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..