Monday, November 18, 2024

క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసిన నెల రోజుల్లోనే మ‌రో ప్ర‌పంచ క‌ప్

క్రికెట్ అభిమానులకు ఐసీసీ మరో గుడ్ న్యూస్ తెలిపింది. అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి ఇవ్వాల‌ అండ‌ర్ -19 పురుషుల‌ వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 షెడ్యూల్ విడుద‌ల చేసింది. 15వ ప్ర‌పంచ క‌ప్ టోర్నీకి శ్రీ‌లంక ఆతిథ్యం ఇస్తున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 13న టోర్నీ షురూ కానుంది. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసిన నెల రోజుల్లోనే ఈ అండ‌ర్ -19 ప్ర‌పంచ క‌ప్ మొద‌లవ్వ‌నుంది. మొత్తం 23 రోజుల పాటు జ‌రిగే ఈ టోర్నీ ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన‌ ముగుస్తుంది.

కాగా, ఈ టోర్నీలో మొత్తం 16 జ‌ట్లు టైటిల్ కోసం పోటీ ప‌డ‌నున్నాయి. వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభ‌జించ‌గా.. ఫైన‌ల్‌తో క‌లిపి 41మ్యాచ్‌లు నిర్వ‌హిస్తారు. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్ 6కు అర్హత సాధిస్తాయి. వీటి మ‌ధ్యే సెమీస్ ఫైట్ ఉంటుంది. ఈ టోర్నీలో భార‌త జ‌ట్టు జ‌న‌వ‌రి 14న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడ‌నుంది.

గ్రూప్ ఏ – భార‌త్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా.

గ్రూప్ బి – ఇంగ్లండ్, ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్.

గ్రూప్ సి – ఆస్ట్రేలియా, శ్రీ‌లంక‌, జింబాబ్వే, న‌మీబియా.

- Advertisement -

గ్రూప్ డి – అఫ్గ‌నిస్థాన్, పాకిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్.

శ్రీ‌లంక‌లోని ఐదు ప్ర‌ధాన స్టేడియాల్లో (ఆర్ ప్రేమ‌దాస స్టేడియం, పి, సారా ఓవ‌ల్, కొలంబో క్రికెట్ క్ల‌బ్, నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్ల‌బ్, సింఘ‌లీస్ స్పోర్ట్స్ క్ల‌బ్) అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగ‌నుంది. సెమీఫైన‌ల్, ఫైన‌ల్ మ్యాచ్‌ల‌కు ప్రేమ‌దాస స్టేడియం వేదిక కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement