Friday, November 15, 2024

బ్యాంకు ఖాతాదారులకు గుడ్​ న్యూస్​.. మినిమమ్​ బ్యాలెన్స్​ చార్జీలకు చెక్​

దేశంలో దాదాపు అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. బ్యాంక్ ఖాతాలున్న వారిలో ఉద్యోగాలు చేసేవారు, సాధారణ ప్రజలు, కర్షకులు, కార్మికులు ఇలా అందరూ ఉంటారు. ఒక్కోసారి ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు ఫైన్ విధిస్తుంటాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో మినిమ‌మ్ బ్యాలెన్స్ 2 లేదా రూ.3 వేలు ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ప్రాంతాలను బట్టి కూడా కనీస మొత్తం నిర్ణయిస్తారు. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే రూ.5 నుంచి రూ.10 కనీస మొత్తం ఖాతాల్లో ఉంచాల్సి ఉంటుంది. లేకుంటే బ్యాంకులు ఫైన్ విధిస్తాయి. ఛార్జీలు చెల్లించకుంటే బ్యాలెన్స్ మైనస్ లోకి వెళ్లిపోతోంది. ఎప్పుడైనా ఖాతాదారుడు అందులో డబ్బులు వేస్తే అటోమెటిగ్గా ఛార్జీలు డెబిట్ అయిపోతున్నాయి. దీంతో ఖాతాదారులు నష్టపోతున్నారు.

ఈ క్ర‌మంలో బ్యాంకు ఖాతాదారుల‌కి ఊరట కలిగించేలే చర్యలు చేపట్టింది ఆర్బీఐ. ఖాతాలో కనీస మొత్తం లేనందుకు బ్యాంకులు విధించే ఛార్జీలకు చరమగీతం పాడటానికి ఆర్బీఐ సిద్ధమవుతుంది. సేవింగ్ అకౌంట్‌లో బ్యాలన్స్ సున్నా ఉన్నప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు విధించే చార్జీలను నిలిపివేయాలని ఆర్‌బిఐ బ్యాంకులను కోరింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని చెబుతోంది. మరో ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇదే ప్రకటన చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement