Wednesday, November 20, 2024

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు వందే భారత్ రైలు !

శబరిమలకు వెళ్లే యాత్రికుల రద్దీని దృష్టి.. దక్షిణ మ‌ధ్య‌ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం వందే భారత్ రైలును నడపాలని నిర్ణయించింది. వారంలో రెండు రోజులు పాటు చెన్నై-కొట్టాయం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు ప్రకటించింది. వందేభారత్ రైలు (06151 నెంబరు) డిసెంబరు 15, 17,22, 24 తేదీల్లో చెన్నై నుంచి, డిసెంబరు 16,18,23,25 కొట్టాయం నుంచి బయలుదేరుతుంది.

డిసెంబర్‌ 15, 17, 22, 24 తేదీల్లో చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి నుంచి తెల్లవారు జామున 4.15గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 4.15 గంటలకు కొట్టాయం చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఇదే వందేభారత్‌ శబరి రైలు డిసెంబర్‌ 16, 18, 23, 25 తేదీల్లో కొట్టాయం నుంచి ఉదయం 4.40 గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5.15 గంటలకు చెన్నై చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. కాట్పడి, సేలం, పాలక్కడ్‌, అలువా స్టేషన్లలో ఈ రైలుకు స్టాపులు ఉంటాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement