అయ్యప్ప భక్తులకు విమానయాన శాఖ ఊరటనిచ్చే విషయాన్ని చెప్పింది. ఇకపై ఇరుముడిని విమాన క్యాబిన్‌లో తమవెంట తీసుకెళ్ల వచ్చని తెలిపింది.ఇందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనుమతి ఇచ్చింది. ఎయిర్‌పోర్టులో అన్ని తనిఖీలు ముగిసిన తర్వాత, ఇరుముడిని క్యాబిన్‌లోకి అనుమతించాలని అన్ని విమానాశ్రయ భద్రత సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. అయితే, మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌకర్యాన్ని పరిమితం చేసింది. శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.
ఈ క్రమంలో పవిత్రమైెన ఇరుముడిని దీక్షలో ఉన్న భక్తులు స్వామి వారిచెంతకు తీసుకెళ్తుంటారు.అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం, మండే స్వభావం ఉన్న కొబ్బరికాయలను కేబిన్ లగేజిలోకి అనుమతిలేదు. విజ్ఞప్తుల మేరకు వచ్చే ఏడాది జనవరి 20 వరకు ఇరుముడిని కేబిన్‌లోకి అనుమతించేందుకు బీసీఏఎస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.