Saturday, November 23, 2024

ఏసీలకు భలే డిమాండ్‌.. ఏప్రిల్‌లో 17.50 లక్షల యూనిట్ల అమ్మకాలు

న్యూఢిల్లి : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతీ ఒక్కరు ఏసీల కొనుగోళ్లవైపు పరుగులు పెడుతున్నారు. ఈ ఏడాది సుమారు రికార్డు స్థాయిలో 90లక్షల యూనిట్లు ఏసీలు అమ్ముడు పోతాయని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీఈఏఎంఏ) మంగళవారం తెలిపింది. ఏప్రిల్‌లో 17.50 లక్షల ఏసీ యూనిట్లను విక్రయించినట్టు వివరించింది. ఈ అమ్మకాలు ఆల్‌ టైం హైగా ప్రకటించింది. రానున్న మరికొన్ని నెలల్లో ఏసీల తయారీ, లభ్యత, సరఫరా పరంగా డిమాండ్‌ తలెత్తే అవకాశం ఉంటుందని సీఈఏఎంఏ వెల్లడించింది.

మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఎంపిక చేసిన మోడల్స్‌ సదరు కంపెనీలు సకాలంలో అందించకపోవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మార్కెట్‌లో కంట్రోలర్స్‌, కంప్రెసర్స్‌కు ఎంతో డిమాండ్‌ ఉందని వివరించింది. గృహ అవసరాలకు ఉపయోగించే ఏసీల విక్రయాలు ఏప్రిల్‌లో 1.75 మిలియన్‌కు చేరుకున్నాయి. 2021, ఏప్రిల్‌.. 2019 ఏప్రిల్‌తో పోలిస్తే.. రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగాయని సీఈఏఎంఏ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement