వానాకాలం మొదలైంది.. కాలం మారింది.. రోజంతా బిజీ బిజీగా గడిపేస్తున్న సిటీవాసులు కాస్తంతా క్వాలిటీ టైమ్ గడపాలన్నా కష్టమే. మరి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మన అనుకునే వాళ్లతో కాస్తంత టైమ్ దొరికితే ఇక చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు.. ఈ సీజన్ లో సరదాగా ఫ్రెండ్స్ తో అలా చల్లటి గాలిలో, చిటపట చినుకులు పడుతున్న టైమ్‌లో వెదర్ ని ఎంజాయ్ చేస్తూ ఓ చక్కటి చాయ్ తాగుతుంటే ఎంతో మజా ఉంటుంది కదా! అలా మీరు కూడా ఓ మాంచి సాయత్రం వేళ మీ ఫ్రెండ్స్ తోనో, రిలేటీవ్స్‌తోనే ఓ చాయ్ కోసం ట్రై చేసి చూడండి.. మీ మూడ్ మొత్తం మారిపోతుంది..
చాయ్ అంటే ఇష్టపడని వారు ఉండరు.. కానీ, చాయ్ అంటే.. పాలు, చక్కెర, కాస్తంత టీపౌడర్ వేస్తే ఇక చాయ్ అయిపోతుందనుకుంటే ఇక టీపౌడర్‌లో కాలు వేసినట్టే.. చాయ్ కి సంబంధించిన ఈ కొత్త వెరైటీలు వింటే అబ్బో అంటారు. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు తప్పనిసరిగా ఈ వెరైటీలను ప్రయత్నించాలి. చాయ్ లో ఎన్నో రకాలు మనం రెగ్యులర్ గా తాగే మసాల టీ, అల్లం టీ లాంటివే కాకుండా ఇంకా చాలా రకాలున్నాయి .. అవేంటో తెలుసుకుని ఓ సారి ట్రై చేయండి.. టీని ఆస్వాదించండి!!
కట్టింగ్ చాయ్ : వేడి టీ.. చాలా హాట్ గా ఉంటుంది. పొగలు కక్కుతున్న అగ్నిపర్వతంలా ఉంటుంది ఈ చాయ్.
డబుల్ మలై చాయ్ : ఎక్స్ ట్రా మలైతో చేసే ఇరానీ చాయ్ ని.. డబుల్ మలై చాయ్ అంటారు.
కడా చమ్మచ్ : చెంచా నిటారుగా నిలబడగలిగేంత చక్కెర ఉంటుంది గ్లాస్ కింద
సులైమానీ/గవా : ఖర్జూరం, నల్ల మిరియాలతో చేస్తారు దీన్ని… వెరైటీగా ఉంటుంది..
పౌనా టీ : టీలో పాలు, చక్కెర, చాలా క్రీమ్‌తో చేస్తారు. ఇలాంటి చాయ్ ఉన్నప్పుడు డయాబెటిస్ గురించి ఎవరు పట్టించుకుంటారు!
గోల్డెన్ చాయ్ : జంట నగరాల్లో ఈ గోల్డెన్ కలర్ చాయ్ మరో కొత్త ట్రెండ్ అవుతోంది.
పుదీనా చాయ్ : “పుదినా”తో రుచిగా, పైన దాని ఆకులతో డెకరేట్ చేసి ఇస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.