Tuesday, November 26, 2024

కెన‌డా పౌర‌స‌త్వానికి గుడ్ బై- అక్ష‌య్ కుమార్

షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు బాలీవుడ్ కిలాడీ అక్ష‌య్ కుమార్. ఆయ‌న కెన‌డా పౌర‌స‌త్వాన్ని వ‌దిలేస్తున్న‌ట్లు తెలిపారు.కాగా అక్షయ్ కుమార్ కి .. భారత్‌తో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది. ఈ విషయమై గత కొన్ని రోజులుగా అక్ష‌య్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా అక్షయ్ తాజాగా స్పందించారు. తాను భారతీయుడినని.. త‌న‌కి సర్వం భారత దేశమేనని స్పష్టం చేశారు. కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఇండియానే నాకు సర్వస్వం. నేను ఏం సంపాదించినా.. సాధించినా అన్నీ ఇక్కడి నుంచే. ఇప్పుడు మాతృభూమి రుణం తీర్చుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తాను. కానీ ఏం తెలియకుండా కొందరు మాట్లాడే మాటలు చాలా బాధిస్తాయి’ అని అన్నారు. ఈ సందర్భంగా తాను కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్లు షాకింగ్ ప్రకటన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement