Tuesday, January 21, 2025

AP | గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌గా కోటేశ్వరరావు..

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌గా గోనుగుంట్ల కోటేశ్వరరావును నియమిస్తూ పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆయన ఛైర్మన్‌గా కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

గతంలో ఛైర్మన్‌గా ఉన్న మందపాటి శేషగిరి రావును తొలగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు సభ్యరాలు, విజయనగరం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా ఉన్న రెడ్డి పద్మావతిని తొలగించారు.

అలాగే పశ్చిమ గోదావరి, వైఎస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాల గ్రంథాలయ ఛైర్మన్‌లు చీర్ల పద్మ శ్రీ, ఎల్‌. ఉష, ఎన్‌. మధుబాలలను తొలగించారు. తాజాగా ఏపీ గ్రాంథాలయ ఛైర్మన్‌గా కోటేశ్వరరావును నియమించగా మిగిలిన స్థానాలలో ఛైర్మన్‌లను నియమించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement