Tuesday, November 26, 2024

గోల్డ్ స్మ‌గ్లింగ్.. ఎయిర్ ఇండియా ఉద్యోగి అరెస్ట్

గోల్డ్ స్మ‌గ్లింగ్ చేస్తూ క‌స్ట‌మ్స్ అధికారుల‌కు చిక్కాడు ఎయిర్ ఇండియా ఉద్యోగి. 1487 గ్రాముల బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించిన షఫీని కస్టమ్స్ అధికారులు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. బహ్రెయిన్-కోజీకోడ్-కొచ్చి విమానం కేబిన్ క్రూలో పనిచేస్తున్న షఫీ బంగారం తీసుకొస్తున్నట్టు అధికారులకు విశ్వసనీయ సమాచారం అందడంతో అతడిని అరెస్టు చేశారు. బంగారం ఉన్న ప్లాస్టిక్ కవర్లను చేతికి చుట్టుకుని ఫుల్ స్లీవ్స్ కింద దాచి స్మగ్లింగ్ చేయాలనుకున్న షఫీ పథకం పారలేదు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. మరో ఘటనలో కస్టమ్స్ అధికారులు 6.8 కేజీల బంగారాన్ని అక్రమరవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు విమాన ప్రయాణికులను అరెస్టు చేశారు. సింగపూర్‌ నుంచి వచ్చిన ఆ ఇద్దరినీ చెన్నై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.3.32 కోట్లని తెలిసింది. నిందితులు ఇద్దరు ఎయిర్ ఇండియాకు చెందిన రెండు వేర్వేరు విమానాల్లో వచ్చారని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement