నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. రెండు రోజుల్లోనే రూ.750 జంప్ చేసిన బంగారం ధరలు నేడు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,490 వద్ద నమోదైంది. గత వారం రోజులుగా చూస్తే మాత్రం 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర రూ.46,900 నుంచి రూ.47,200కి పెరిగింది. బంగారం స్థిరంగా ఉన్న ఈ సమయంలో వెండి రేట్లు భారీగా పెరిగాయి.
కేజీ వెండి ధరపై రూ.1,400 మేర పెరగడంతో.. ఈ రేటు రూ.63,700కు చేరుకుంది. మూడు రోజుల నుంచి వరుసగా వెండి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ మూడు రోజుల్లోనే రూ.3,700 మేర ధర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,350గా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,660గా ఉంది. ఢిల్లీలో వెండి ధర పెరుగుదల మాత్రం హైదరాబాద్‌తో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. అక్కడ కేజీ వెండి ధర కేవలం రూ.400 మాత్రమే పెరగడంతో.. ఈ రేటు రూ.58,400కు చేరుకుంది.