బంగారం ధర తగ్గుదలకు అడ్డుకట్ట పడింది. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి రేటు ఈ రోజు మాత్రం నిలకడగానే కొనసాగింది. పుత్తడి స్థిరంగానే ఉంది. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పసిడి రేటు నిలకడగా కొనసాగితే.. వెండి ధర మాత్రం నేలచూపులు చూసింది. భారీగా దిగొచ్చింది. దీంతో వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు దిగి వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 19న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనిస్తే.. హైదరాబాద్లో బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,250 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు అయితే పది గ్రాములకు రూ. 47,900 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి రేటు మాత్రం రూ.900 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.62,400కు దిగి వచ్చింది. కాగా పైన పేర్కొన్న రేట్లకు జీఎస్టీ, తయారీ చార్జీలు వంటివి అదనం.