Saturday, November 23, 2024

శాంతించిన బంగారం.. ధరలు తగ్గుముఖం..

బంగారం తగ్గుముఖం పట్టాయి. గతవారం రూ.2వేల మేరకు తగ్గిన పసిడి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. ప్రారంభ సెషన్‌లో ఏప్రిల్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ రూ.178 తగ్గి రూ.52,700 వద్ద ట్రేడ్‌ అయింది. జూన్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ రూ.263తగ్గి రూ.53,280వద్ద ట్రేడ్‌ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌ కామెక్స్‌లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ గత వారం 2వేల డాలర్లు దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 1980డాలర్లు దిగువకు చేరింది.

సిల్వర్‌ ఫ్యూచర్స్‌ రూ.70వేలకు దిగివచ్చింది. మే సిల్వర్‌ ఫ్యూచర్స్‌ రూ.390క్షీణించి రూ.69,980వద్ద జులై సిల్వర్‌ ఫ్యూచర్స రూ.462 క్షీణించి రూ.70,676వద్ద ట్రేడ్‌ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌ కామెక్స్‌లో సిల్వర్‌ ఫ్యూచర్స్‌ 0.222 డాలర్లు తగ్గి 25,938 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయింది. ఎంసీఎక్స్‌లో పసిడి రూ.52,700 స్థాయికి చేరింది. కాగా ఆగస్టు 2020లో ఆల్‌టైమ్‌ గరిష్ఠం రూ.56,200కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో 1971డాలర్లు వద్ద ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement