Tuesday, November 26, 2024

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. డాలర్‌తో పోల్చి చూసినట్లయితే రూపాయి మారకం విలువ రూ.81.843 వద్ద ఉంది. దిల్లీలో బంగారం ధర 22 క్యారెట్లకు స్థిరంగా 10 గ్రాములు రూ.51,950 వద్ద ఉండగా.. 24 క్యారెట్ గోల్డ్ అక్కడ రూ.56,700 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు స్థిరంగా రూ. 51,850 వద్ద.. 24 క్యారెట్ గోల్డ్ రూ.56,550 వద్ద కొనసాగుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గిన వెండి ధరలు తాజాగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్‌లో రూ.600 మేర పెరిగి రూ.70,600 మార్కు వద్ద ఉంది. ఇదే వెండి దిల్లీలో కిలోకు రూ.100 ఎగబాకి రూ. 67 వేల మార్కు వద్ద ఉంది. దిల్లీతో చూస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. వెండి ధరలు ఎక్కువగా ఉంటాయి. బంగారం కొనేవారికి ఇటీవల కేంద్రం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల నుంచి ఆరంకెల కోడ్‌తో (HUID) హాల్‌‌మార్క్ చేయని బంగారు ఆభరణాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. వాటి అమ్మకాలపై నిషేధం విధించింది. కస్టమర్లు కొనేముందు గోల్డ్ జువెలరీపై HUID ఉందో లేదో చెక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై BIS యాప్ ద్వారా ఫిర్యాదులు కూడా చేయొచ్చని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement