రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో బంగారు గనులను కనుగొన్నట్టు ఒడిశా ఉక్కు గనుల శాఖ మంత్రి ప్రఫుల్లా మల్లిక్ అసెంబ్లిలో తెలిపారు. ధెన్‌కనల్ ఎమ్మెల్యే సుధీర్ కుమార్ సమల్ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి, డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(సీఎస్‌ఐ) తెలిపిన సమాచారం ప్రకారం, ఒడిశాలోని దియోగఢ్, కియోన్‌జర్, మయుర్‌భంన్జ్ జిల్లాల్లో బంగారు గనుల నిల్వలు ఉన్నాయని అన్నారు. కియోన్‌జర్ జిల్లాలో నాలుగు ప్రదేశాలు, మయుర్‌భంన్జ్ జిల్లాలో నాలుగు, దియోగఢ్ జిల్లాలో ఒక ప్రదేశంలో బంగారు నిల్వలు ఉన్నాయని సీఎస్‌ఐ తెలిపినట్లు మంత్రి మల్లిక్ పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement