Friday, November 22, 2024

మహిళలకు గుడ్ న్యూస్: కాస్త దిగివచ్చిన బంగారం ధరలు..

బంగారం ధరలు ఊగిసలాడుతున్నాయి. ప్రస్త్తుతం పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. ఇండియాతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక మన ఇండియాలో జరిగే పెళ్లిళ్ల సీజ‌న్‌లో పసిడికే డిమాండ్‌ ఎక్కువ. అయితే… గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 10 తగ్గి రూ. 43,590 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 10 తగ్గి రూ. 47,550 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక అటు… వెండి ధ‌ర‌లు కూడా కాస్త తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ. 200 తగ్గి రూ. 64,900 వ‌ద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: వెదర్ రిపోర్ట్: తెలంగాణకు వర్ష సూచన

Advertisement

తాజా వార్తలు

Advertisement