బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. పండగ సమయంలో మాత్రమే రేట్లు ఒకటి, రెండు రోజులు కాస్త పెరిగినట్లు కనిపించింది. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46 వేల 750 వద్ద ఉంది. అంతకుముందు రోజు ఇది రూ.350 మేర తగ్గింది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు హైదరాబాద్లో రూ.51 వేల వద్ద ఉంది. ఇది కూడా కనిష్ట విలువే కావడం గమనార్హం. ముందురోజు రూ.700 మేర తగ్గిన సిల్వర్ రేటు కూడా స్థిరంగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి రూ.63 వేలకు అమ్ముడవుతోంది. ఇక దేశరాజధాని దిల్లీలో బంగారం ధర (22 క్యారెట్లు) తులం రూ.46 వేల 900 పలుకుతోంది. ఇక ఇదే 24 క్యారెట్ల విషయానికి వస్తే దిల్లీలో రేట్లు 10 గ్రాములకు రూ.51,160 వద్ద ఉంది. మిగతా చోట్లతో పోలిస్తే సిల్వర్ రేటు దిల్లీలో చాలా తక్కువ. ఇక్కడ కిలో వెండి ధర రూ.57 వేల 500 వద్ద ఉండటం విశేషం. ఇక విజయవాడలో కూడా హైదరాబాద్లో మాదిరే రేట్లు ఉన్నాయి. మిగతా చోట్ల కూడా ఆయా పరిస్థితులను బట్టి రేట్లలో స్వల్ప మార్పులుంటాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement