కొద్ది రోజులుగా వరసుగా దిగివచ్చిన బంగారం ధర మళ్లీ పుంజుకుంటోంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర క్రితం రోజుతో పోలిస్తే స్థిరంగా ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు రూ.51 వేల 850 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం సైతం స్థిరంగానే ఉంది. హైదరాబాద్లో తులం రేటు ప్రస్తుతం రూ.56 వేల 550 మార్క్ వద్ద ఉంది. ఇక దేశ రాజధాని దిల్లీ విషయానికి వస్తే బంగారం ధర స్థిరంగానే ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.51 వేల 950 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.56 వేల 550 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే గత మూడు రోజులుగా ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.70 వేల వద్ద ఉంది. ఒకానొక దశలో సిల్వర్ రేటు రూ.76 వల మార్కును తాకిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాంతో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉండడం ఊరట కలిగించే విషయమే. దేశ రాజధాని దిల్లీలో సైతం ఇవాళ వెండి ధర స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.66 వేల 900 మార్క్ వద్ద ఉంది. అయితే, దిల్లీతో పోలిస్తే హైదరాబాద్లో గోల్డ్ రేట్లు కాస్త తక్కువగా, సిల్వర్ రేట్లు ఎక్కువగానూ ఉంటాయి. దీనికి స్థానిక పన్నులు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
Advertisement
తాజా వార్తలు
Advertisement