Tuesday, November 19, 2024

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధర.. తులం గోల్డ్ ఎంతంటే?

ఇటీవల వరుసగా పడిపోతూ వస్తున్న గోల్డ్, సిల్వర్ ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. వరుసగా రెండు రోజులు ధరలు పెరిగిన క్రమంలో మళ్లీ గరిష్ఠాలను తాకుతాయేమోననే భయాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి స్వల్పంగా పెరిగినా కనిష్ఠ స్థాయిలోనే ఉండడం ఊరటనిస్తోంది. ప్రస్తుతం దిల్లీ, హైదరాబాద్‌ నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదారాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.150 మేర పెరిగింది. ప్రస్తుతం గోల్డ్ తులం రూ.51 వేల 600 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం హైదారాబాద్‌లో తులానికి రూ.170 మేర పుంజుకుని ప్రస్తుతం రూ.56 290 మార్క్ వద్దకు చేరింది. ఇక దిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.150 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.51 వేల 750 వద్ద ఉంది. మరోవైపు దిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులానికి రూ.170 మేర పెరిగి ప్రస్తుతం రూ.56,440కి చేరింది. ఇక వెండి విషయానికి వస్తే గోల్డ్‌ను ఫాలో అవుతోంది. సిల్వర్ సైతం వరుసగా రెండో రోజు భారీగా పెరిగింది. క్రితం సెషన్‌లో కిలో వెండి రూ.200 పెరగగా.. ఇవాళ్ల ఏకంగా రూ.1000 మేర పుంజుకుంది. హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.70 వేల 200 మార్క్ వద్దకు చేరింది. దేశ రాజధాని దిల్లీ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.67 వేల వద్దకు చేరింది. హైదరాబాద్‌తో పోలిస్తే దేశ రాజధానిలో సిల్వర్ చాలా తక్కువగా ఉంటుంది. బంగారం మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది. స్థానిక పన్నులను బట్టి ఈ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement