బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర గత 6 సెషన్లలో రూ.800 తగ్గగా.. ఇవాళ స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ.52 వేల 200 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.440 పెరిగింది. ప్రస్తుతం రూ.56,950 వద్ద ఉంది. ఇక దేశ రాజధాని దిల్లీలో బంగారం 22 క్యారెట్లకు రూ.400 పెరిగి ప్రస్తుతం రూ.52 వేల 350 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ ధర తులానికి రూ.440 పెరిగి రూ.57 వేల 100 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే.. గత నాలుగు సెషన్లలో రూ.1300 తగ్గిన కిలో వెండి ధర (Silver Rate Today) ఇవాళ కాస్త పుంజుకుంది. కిలో సిల్వర్ రూ.600 పెరిగి ప్రస్తుతం రూ.71, 800 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో గత నాలుగు సెషన్లలో రూ.1800 మేర తగ్గింది. ఇవాళ్ల వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.68,600 వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో బంగారం ధర రూ.71 వేల 800 వద్ద ఉంది.
Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..!
Advertisement
తాజా వార్తలు
Advertisement