బంగారం ధర కొండెక్కింది. ఒకేసారి భారీగా బంగారం ధర పెరిగింది. అయితే ఈ ధర పెంపు కేవలం 24 క్యారెట్లపైనే ఉంది. 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర భారీగా రూ.1,800 మేర పెరిగింది. ఈ ధర దాదాపు రూ.2 వేల పెరగడంతో.. దీని రేటు రూ.52 వేలకు చేరింది. అయితే 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర మాత్రం స్థిరంగా రూ.46 వేల వద్దనే పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర కొండెక్కిన ఈ సమయంలో.. వెండి రేటు కూడా స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర హైదరాబాద్‌లో రూ.61,500గా పలుకుతోంది. విజయవాడలో కూడా 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర భారీగా పెరగగా.. 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర స్థిరంగా ఉంది. విజయవాడలో బంగారం రేట్లు.. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల ధర రూ.46 వేలుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 పెరిగి.. ఈ రేటు రూ.52 వేలకు ఎగబాకింది. ఇక పోతే విజయవాడలో వెండి రేట్లు(Silver Rates) రూ.61,500 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం, వెండి రేట్లు స్థిరంగా పలుకుతున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 వద్ద, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.50,350 వద్ద ఉన్నాయి. అలాగే వెండి రేటు కేజీ రూ.56,300గా పలుకుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement