కొద్ది రోజులుగా వరుసగా పడిపోయిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. మూడు రోజుల్లో తులం గోల్డ్ ఏకంగా రూ.400 మేర పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే ఇవాళ కాస్త దిగివచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ ధర హైదరబాద్‌లో రూ.150 పెరిగి ప్రస్తుతం రూ.51 వేల 750కి చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులం రేటు రూ.160 పెరిగింది. ప్రస్తుతం తులానికి రూ.56,450 మార్క్ వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని దిల్లీలో సైతం బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం దిల్లీలో రూ.150 పెరిగి రూ.51,900 వద్ద ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రు.160 పెరిగింది. ప్రస్తుతం రూ.56,600 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఒక్కసారిగా రూ.1000 పెరిగిన కిలో వెండి ధర ఇవాళ రూ. 200 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70 వేల వద్ద ఉంది. ఇక దేశ రాజధాని హస్తినాలో కిలో వెండి ధర రూ.500 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి దిల్లీలో రూ.66,500 వద్ద కొనసాగుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement