బంగారం ధరలు భారీగా తగ్గాయి. మొన్నటి దాకా ఆకాశాన్నంటిన బంగారం ధరలు నేడు కొంత మేర తగ్గడంతో బంగారం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దసరా, దీపావళి వంటి పండగల సీజన్‌లో గోల్డ్ రేట్లు భారీగా పడపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రికార్డు స్థాయిలో రేట్లు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ నేపథ్యంలో.. అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పుల ఆధారంగా మళ్లీ రేట్లు తగ్గాయి. మన బులియన్ మార్కెట్లో బంగారం ధర ఒక్కరోజే రూ.460 మేర పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 460 తగ్గి.. రూ.47 వేల 800కు చేరింది. అంతకుముందు రోజు ఇది రూ.48 వేల 260 వద్ద ఉండేది. అయితే బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి రేట్లు పెరిగాయి. ఒక్కరోజే రూ.800 మేర పెరగ్గా.. హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర రూ.68 వేల 500కు చేరింది. అంతకుముందు రోజు ఇది రూ.67,700 వద్ద ఉంది. బంగారం పెరిగి తగ్గుతున్నప్పటికీ, సిల్వర్ ధర మాత్రం పెరుగుకుంటూ పోతూనే ఉంది. అక్టోబర్‌లో కూడా వెండి ధర అత్యధికంగా 5వ తేదీ రూ.67 వేల వద్దే ఉంది. అక్టోబర్ 15న రూ.60 వేల 500కు రేటు పడిపోవడం విశేషం. కానీ ఒక్క నెలలోనే ఎంత తేడా వచ్చింది. ఏకంగా రూ. 8 వేలు పెరగడం గమనార్హం. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ.490 మేర పడిపోయింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.52 వేల 150కి పడిపోయింది.
Gold Rate Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
Advertisement
తాజా వార్తలు
Advertisement