నేటి బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఆగస్ట్ 25న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 మేర పెరిగింది. దీంతో పది గ్రాములకు ఈ పసిడి రేటు రూ. 51,550కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే.. రూ. 250 పెరిగింది. దీంతో ఈ పసిడి రేటు పది గ్రాములకు రూ. 47,250కు ఎగసింది. హైదరాబాద్‌లో ఈ రేట్లు వర్తిస్తాయి. అలాగే వెండి ధరను గమనిస్తే.. రూ. 200 పెరిగింది. ఈ క్రమంలో కేజీ సిల్వర్ రేటు రూ. 60,900కు చేరింది. కాగా పైన పేర్కొన్న బంగారం వెండి ధరలకు జీఎస్‌టీ, తయారీ చార్జీలు, ఇతరత్రా వంటివి అదనం. దేశీ మార్కెట్‌లో పసిడి పరుగుకు గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పైకి కదలడం కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రోజు గోల్డ్ రేటు మెరిసింది. పైపైకి ర్యాలీ చేసింది. బంగారం ధర ఔన్స్‌కు 0.26 శాతం మేర పెరిగింది. దీంతో బంగారం ధర 1766 డాలర్లకు ఎగసింది. అలాగే సిల్వర్ రేటు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. వెండి ధర కూడా ఔన్స్‌కు 0.58 శాతం మేర పెరిగింది. దీంతో ఈ వెండి ధర 19 డాలర్ల పైకి ఎగసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement