Friday, November 22, 2024

పసిడి మరింత ప్రియం

పసిడి ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. దీనికి కారణం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన స్వతంత్ర ప్రాంతాల ప్రకటనే కారణం. అంతర్జాతీయ మార్కెట్స్‌లో ధరలు 9నెలల గరిష్టానికి చేరుకున్నాయి. రాజధాని ఢిల్లిdలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600కు పైగా పెరిగి.. రూ.50,547కు చేరుకుంది. 22 క్యారెట్ల ధర రూ.45,743 నుంచి రూ.46,301కు పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250కు పెరిగింది.

తులంపై సుమారు రూ.300 పెరిగింది. 24 క్యారెట్‌ బంగారం రూ.410 పెరిగి.. రూ.50,460కు చేరుకుంది. వెండి ధర కిలోపై రూ.1100 పెరిగి.. రూ.64,656కు చేరుకుంది. బంగారం, వెండి ధరలు.. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యూవెలరీ మార్కెట్‌ వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement