రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయి. క్వీవ్, ఖార్కివ్‌లో పేలుళ్లు జరగడంతో మదుపర్లు పునరాలోచనలో పడ్డారు. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడివైపు మొగ్గుచూపారు. దీంతో గోల్డ్ ఫ్యూచర్ మళ్లిd రూ.51వేలను అధిగమించాయి. గతవారం చివరిసెషన్‌లో రూ.50వేల స్థాయికి దిగిపోయింది.తాజాగా మళ్లిd రూ.52వేలకు తాకింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.722 (1.44శాతం) పెరిగి 50,943వద్ద ట్రేడ్ అయింది. సోమవారం ఓ దశలో 51,200 దాటింది. యుద్ధ వాతావరణం కారణంగా ఆరంభంలోనే రూ.600కిపైగా పెరుగుదలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.750కి పెరిగి రూ.51,110వద్ద ట్రేడ్ అయింది.
కాగా అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1910 డాలర్లుకు చేరువైంది.సోమవారం ప్రారంభ సెషన్‌లో 22డాలర్లు లాభపడి 1909 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. పసిడితోపాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1062 (1.66శాతం) లాభపడి రూ.65,085వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 24డాలర్లు దాటింది.సిల్వర్ ఫ్యూచర్ 0,413 డాలర్లు (1.72శాతం) 24,410డాలర్లు వద్ద ట్రేడ్ అయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..