Friday, November 22, 2024

స్థిరంగా బంగారం ధరలు – లేటెస్ట్

దేశంలో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. మాములుగా బంగారంకు ఉన్న డిమాండ్ మన దేశంలో ఇంకా దేనికి లేదు. అయితే అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉండటంతో పాటుగా, దేశీయంగా కూడా మార్కెట్లు పుంజుకోవడంతో తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

కాగా మంగళవారం రోజున బంగారం ధరలు స్థిరంగా నమోదయ్యాయి. తాజా ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,590కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,650కి చేరింది. ఇక వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ.73,800కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement