Friday, November 22, 2024

52 వేలు దాటిన బంగారం ధరలు..

బంగారం ధరలు పెరిగాయి. గతవారం ప్రారంభంలో తగ్గుతున్నట్లుగా కనిపించిన పసిడి ధరలు అంతలోనే పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ కామెక్స్‌లో ఓ సమయంలో ఆల్‌ టైమ్‌ గరిష్టం 2075 డాలర్లకు సమీపానికి (2060 డాలర్లు దాటి) వెళ్లిన పసిడి ఆ తర్వాత 1920 డాలర్ల దిగువకు వచ్చి ఊరటను ఇచ్చింది. ఆల్‌ టైమ్‌ గరిష్టంతో 155 డాలర్ల మేర తక్కువకు పడిపోయింది. కానీ ఇప్పుడు 120 డాలర్ల మేర తక్కువగా ఉంది. దేశీయ ఫ్యూచర్‌ మార్కెట్‌లోను రూ.51,000 దిగువకు పడిపోయిన గోల్డ్‌ ఫ్యూచర్‌ ఇప్పుడు రూ.52,000 క్రాస్‌ చేసి, రూ.52,500 దిశగా కనిపిస్తోంది. దేశీయ ఫ్యూచర్‌ మార్కెట్‌ మల్టి కమోడిటీ ఎక్స్చేంజ్‌లో జూన్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ రూ.202 పెరిగి రూ.52,099 వద్ద, ఆగస్ట్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ రూ.171 పెరిగి రూ.52,338 వద్ద ముగిసింది. సిల్వర్‌ ఫ్యూచర్‌ కూడా పెరిగింది.

అయినప్పటికీ రూ.67,000 స్థాయిలోనే ఉంది. చివరి సెషన్లో మే సిల్వర్‌ ఫ్యూచర్స్‌ రూ.267 పెరిగి రూ.67,032 వద్ద, జూలై సిల్వర్‌ ఫ్యూచర్స్‌ రూ.241.00 పెరిగి రూ.67,759 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌ కామెక్స్‌లో గోల్డ్‌ సిల్వర్‌ క్రితం సెషన్‌లో 10 డాలర్లకు పైగా ఎగిసి 1948 డాలర్ల వద్ద, సిల్వర్‌ ఫ్యూచర్స్‌ 0.172 డాలర్లు ఎగిసి 24.907 డాలర్ల వద్ద ముగిసింది. రష్యాఉ్ఖక్రెయిన్‌ యుద్ధం సమయంలో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 2060 డాలర్ల పైకి చేరుకుంది. కానీ యుద్ధం కాస్త తగ్గాక ధరలు క్షీణించాయి. అయితే ఇటీవల చమురు ధరలు పెరగడం, చైనాలో కరోనా కేసులు, ద్రవ్యోల్భణ ఆందోళనలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement