Wednesday, November 20, 2024

పసిడి ప్రియులకు కాస్త ఊరట… స్థిరంగా బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, దిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో మనం ఓసారి చూద్దాం. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 వద్ద కొనసాగుతుండ‌గా.. క్రితం రోజు ఇది తులానికి రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం మాత్రం ఎలాంటి మార్పూ లేదు. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.57,060 వద్ద ఉండ‌గా.. క్రితం రోజు స్వల్పంగా తగ్గినప్పటికీ అంతకుముందు వరుసగా పెరగడం గమనార్హం. దిల్లీలో కూడా బంగారం ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్‌తో పోలిస్తే ఇక్కడ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ.52,400 వద్ద ఉండగా.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,210 వద్ద కొనసాగుతోంది. వెండి ధర ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం దిల్లీలో కిలో వెండి రూ.72,300 వద్ద కొన‌సాగుతోంది. వరుసగా రెండు రోజుల్లో రూ.400 మేర పెరిగింది. అంతకుముందు వరుసగా 3 రోజుల్లో కలిపి రూ.1000 పడిపోయింది. ఇక దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు ఎక్కువగా ఉంటుంది. అక్కడ ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.74,300 వద్ద ఉంది. ఇటీవల 4 రోజుల్లో కలిపి రూ.3700 పడిపోయింది. లేకుంటే ఇప్పుడు సిల్వర్ రేటు రూ.77 వేలకు చేరువలో ఉండేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement