Friday, November 22, 2024

Gold Price Today: త‌గ్గిన బంగారం.. పెరిగిన వెండి ధ‌ర‌లు..

పసిడి ప్రియులకు ఇది స్వల్ప ఊరట అనే చెప్పాలి. క్రితం రోజు జీవనకాల గరిష్ఠాలను తాకిన బంగారం ధర కాస్త దిగొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, దిల్లీ సహా ఇతర నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.100 మేర దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం తులం బంగారం రూ.52,250కి చేరింది. మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50 తగ్గి రూ. 57,060కి చేరింది. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్లకు చెందిన తులం పసిడి ధర రూ.100 తగ్గింది. ప్రస్తుతం తులం రూ.52,400 వద్దకు దిగొచ్చింది. ఇక హస్తినాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.60 మేర తగ్గి రూ.57, 210 వద్ద కొనసాగుతోంది. వెండి ధ‌ర ఈరోజు కిలోకి రూ. 2200 పెరిగి రూ.74,300లకు చేరింది. ఇటీవల ఈ వెండి ధర రూ.75,800 వద్ద ఉండగా.. ఈ రేటుతో పోలిస్తే కాస్త ఊరటగానే చెప్పాలి. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో వెండి రేటు మళ్లీ పెరిగింది. శుక్రవారం కిలో వెండి రూ.200 పెరగగా.. ఇవాళ మళ్లీ రూ.200 ఎగబాకింది. దీంతో హస్తినాలో కిలో వెండి ధర రూ. 72,300లకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement