Sunday, November 17, 2024

Gold Price Today: రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కరోజే రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.500 మేర పెరిగి రూ.53 వేల మార్కును తాకింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.550 పుంజుకొని ఏకంగా రూ.57,820 వద్ద ట్రేడవుతోంది. ఇక దిల్లీలో కూడా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం అక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రూ.500 ఎగబాకి రూ.53,150కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.57,980 మార్కును తాకింది. మరోవైపు వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలోనే పెరిగాయి. ఫిబ్రవరి 1న కిలో వెండి రేటు దేశరాజధాని దిల్లీలో రూ. 1000 మేర పుంజుకొని రూ.73,300 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో మరీ ఎక్కువగా పెరిగింది. ఒక్కరోజే రూ.1500 పెరగ్గా.. ప్రస్తుతం కేజీ సిల్వర్ హైదరాబాద్‌లో రూ.76 వేలకు చేరింది. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. అదే బంగారం రేట్లు కాస్త తక్కువగా ఉంటాయి. స్థానికంగా ఉండే పన్నుల కారణంగా ఈ హెచ్చుతగ్గులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement