Thursday, November 21, 2024

Gold Price Today : స్థిరంగా బంగారం, వెండి ధ‌ర‌లు..

బంగారం ధరలు గత ఆరు నెలల నాటి గరిష్ట స్థాయిల నుంచి కిందకి దిగొచ్చి… కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ లేనంత తక్కువ రేట్లలో ఈ పండగ సీజన్ లో బంగారం కొనుగోలుదారుల్ని మురిపిస్తోంది. దీంతో ఈ పండగ సీజన్‌లో కచ్చితంగా బంగారం, వెండి ఆభరణాల అమ్మకాలు పెరుగుతాయని బులియన్ ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. నేడు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్ లో రూ.46,500 వద్ద స్థిరంగా పలుకుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.50,730 వద్ద రికార్డవుతోంది. బంగారంతో పాటు నేడు వెండి రేట్లు కూడా స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు రూ.62 వేల వద్ద ఉంది. హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అక్కడ కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.46,650 వద్దనే కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.50,890గా రికార్డవుతోంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా స్థిరంగా రూ.56,900 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement