బంగారం, వెండి ధరలు కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. బంగారం కొనాలనుకునేవారికి గుడ్న్యూస్. ఆల్ టైమ్ హై నుంచి దిగివస్తున్నాయి. మరోవైపు.. బంగారం తగ్గినట్లుగానే అదే దారిలోనే వెండి రేటు సైతం భారీగా దిగొచ్చింది. ప్రస్తుతం హైదారాబాద్లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర ఒక్క రోజే రూ.500 మేర తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 53,100 మార్కుకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ (స్వచ్ఛమైన బంగారం) రేటు హైదరాబాద్లో 10 గ్రాములకు ఏకంగా రూ.540 తగ్గింది. ప్రస్తుతం తులం రేటు రూ. 57,930 మార్కుకు దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో సైతం బంగారం ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.53,250కి చేరింది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులం రేటు రూ.530 తగ్గి రూ.58,080కు చేరింది. మరోవైపు.. చెన్నైలో బంగారం ధర భారీగా పడిపోయింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.900 తగ్గి రూ.54,150కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.980 తగ్గి రూ.59,070కు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే బంగారం దారిలో నడుస్తూ భారీగానే దిగొచ్చింది. హైదరాబాద్లో కిలో వెండి రేటు ఒక్కరోజే రూ. 1800 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.76,000కు దిగొచ్చింది. క్రితం రోజు రికార్డు స్థాయికి చేరిన వెండి ధర మళ్లీ పడిపోవడం కాస్త ఊరట కలిగించే విషయం. ఇక దిల్లీలో వెండి రేటు కిలోకు రూ.900 దిగొచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.73,800 వద్దకు పడిపోయింది. మరోవైపు.. చెన్నైలోనూ కేజీ సిల్వర్ రూ. 1800 తగ్గింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రూ.76,000 మార్క వద్దకు చేరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement