హైదరాబాద్‌లో జూన్ 24న బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 పైకి చేరింది. రూ. 51,990కు ఎగసింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200 పెరుగుదలతో రూ. 47,650కు ఎగసింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. దీంతో బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయని చెప్పుకోవచ్చు. పసిడి రేటు రెండు రోజులుగా తగ్గుతూనే వచ్చిన విషయం తెలిసిందే. బంగారం రేటు గత 2 రోజుల్లో రూ. 320 మేర దిగి వచ్చింది. బంగారం బాటలో కాకుండా వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. సిల్వర్ రేటు కేజీకి రూ. 66 వేల వద్ద ఉంది. వెండి రేటు నిన్న రూ. 300 పడిపోయింది.
గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు ఇలా
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలను ఒకసారి గమనిస్తే.. ఈ రోజు దిగి వచ్చాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.28 శాతం మేర తగ్గింది. 1824 డాలర్లకు పడిపోయింది. అలాగే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. 0.61 శాతం క్షీణించింది. ఔన్స్‌కు 20.91 డాలర్ల వద్ద కదలాడుతోంది.
రూ. 51,300 వద్ద నిరోధం
కాగా బంగారం ధరలు రేంజ్ బౌండ్‌లో కదలాడుతున్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్‌లో పసిడి రేటుకు రూ. 51,300 వద్ద నిరోధం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే రూ. 50,500 వద్ద మద్దతు ఉందని తెలియజేస్తున్నారు. వెండి రేటు విషయానికి వస్తే.. రూ. 61,300 వద్ద నిరోధం ఉందని తెలిపారు. ఇంకా రూ. 59,800 వద్ద మద్దతు లభిస్తోందన్నారు.