గత కొన్ని రోజులుగా భారీగా పతనమవుతూ వస్తోన్న బంగారం ధరలు నేడు కోలుకున్నాయి. బంగారం ధరలు పెరిగాయి. తులంపై వంద రూపాయల మేర ధర పెరిగింది. నేడు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.100 పెరిగి రూ.46,950కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధరపై కూడా రూ.100 మేర ధర పెరగడంతో.. ఈ రేటు రూ.51,210గా నమోదైంది. బంగారంతో పాటు వెండి కూడా పైకి కదిలింది. కేజీ వెండిపై రూ.300 మేర ధర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.62,800గా రికార్డయింది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు(Gold Prices) ఇదే స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.100 పెరిగి రూ.46,950గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 51,210గా రికార్డయింది. అయితే వెండి రేట్లు ఢిల్లీలో రూ.200 మాత్రమే పెరగడంతో.. ఈ రేటు అక్కడ రూ.57,200గా ఉంది.
బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా తగ్గాయి. ఈ ధరలు కనిష్టాలకు కూడా పడిపోయాయి. వారం ప్రారంభంలో 10 గ్రాములు రూ.48 వేలుగా ఉన్న బంగారం ధర నేటికి రూ.46,950కి దిగొచ్చింది. అంటే కేవలం వారంలోనే వెయ్యి రూపాయలపైన ధర పతనమైంది. 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర కూడా రూ.52,340 నుంచి రూ.51,210కి పడిపోయింది. ఈ ధర కూడా రూ.1,130 మేర తగ్గింది.