Tuesday, November 26, 2024

గోల్డ్ మెడల్ పై మేయర్ పంటి గాట్లు..

ఒలింపిక్స్ లో గెలిచిన అథ్లెట్లు కెమరా ముందు మెడల్ కొరకడం ఎప్పటి నుంచో ఆనవాయితిగా వస్తోంది. గెలిచిన అథ్లెట్లు మెడల్ కొరికి ఓకే కాని.. ఓ రాజకీయ నాయకుడు కొరికితే ఎలా ఉంటుంది. అది కూడా మెడల్ పై పంటి గాట్లు పడేలా కొరికితే.. ఇంకేముంది.. అందరిముందు నవ్వుల పాలు కావడమే కాకుండా.. భారీగా విమర్శలు ఎదుర్కుంటున్నారు. సాఫ్ట్‌ బాల్‌ ప్లేయర్‌ మియూ గోటో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. సంబురాల్లో భాగంగా సొంత వూరు జపాన్‌ సెంట్రల్‌ సిటీ నయోగాలో జరిగిన ఓ ఈవెంట్‌కి ఆమె హాజరైంది. అక్కడే ఆ నగర మేయర్‌ టకాషి కవామురా అత్యుత్సహం ప్రదర్శించాడు. ఆమె నుంచి గోల్డ్‌ మెడల్‌ను అందుకుని మెడలో వేసుకున్న కవామురా.. తన ముఖానికి ఉన్న మాస్క్‌ కిందకి లాగేసి మరీ ఆ గోల్డ్‌ మెడల్‌ను గట్టిగా కొరికేశాడు. మెడల్‌పై పంటిగాట్లు బలంగా పడ్డాయి. ఈవెంట్‌ తర్వాత ఆ డ్యామేజ్‌ చూసి ఆందోళన చెందిన మియూ వెంటనే టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకుల్ని సంప్రదించింది. 

ఇక టోక్యో నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆ మెడల్‌ను మార్చేందుకు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ మార్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ మెడల్‌ మార్పిడికి అయ్యే ఖర్చును ఐవోసీనే భరించబోతోంది. మరోవైపు కరోనా టైంలో మాస్క్‌ తీసేసి నిర్లక్క్ష్యంగా వ్యవహరించడం, పైగా ఆమె విజయాన్ని అగౌరవపర్చడం తీవ్ర నేరాలంటూ మేయర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెతున్నాయి. ఈ తరుణంలో తన స్థాయిని మరిచి ప్రవర్తించిన తీరుకు టకాషి కవామురా క్షమాపణలు తెలియజేశాడు. ఇక అత్యుత్సాహం ప్రదర్శంచిన మేయర్ విమర్శలు ఎదుర్కుటున్నారు.

ఇది కూడా చదవండి: పెరిగిన బంగారం ధరలు…టుడే గోల్డ్ అప్డేట్

Advertisement

తాజా వార్తలు

Advertisement