చింతూరు(అల్లూరి ), ప్రభన్యూస్ : మన్యంలోని అది ఒక కుగ్రామం. ఆ గ్రామానికి వెళ్ళాలి అంటే అష్టకష్టాలు పడాల్సిందే సుమారు 10 కిలో మీటర్లు కాలినడకన నడిస్తేగాని ఆ గ్రామానికి చేరుకోలేము. అలాంటి గ్రామం ఆదివాసీ గ్రామం నుండి అంతర్జా తీయ స్థాయి చేరుకుంది ఆదివాసీ యువతి కుంజా రజిత. అడవిలో నడిచి నడిచి ఆ నడకలే ఆమెకు పరుగును నేర్పించా యి. ఆ పరుగులో ఇప్పుడు ఆమె అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి బంగారు పతకం సాధించేలా చేసింది. ఆ కుగ్రామంలో కట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం నుండి ప్రపంచ స్థాయి పరుగుపందెంలో పరుగులు పెట్టి భారతదేశ పేరుతో పాటు మన్యం పేరును ప్రపంచస్థాయిలో నిలిపింది.
ఏజేన్సీలో గిరిజన బిడ్డ కుంజా రజిత నేపధ్యం..
చత్తీష్‌గఢ్ రాష్ట్రం నుండి పొట్టకూటి కోసం ఏళ్ళ క్రితం రజిత కుటుంబం మారుమూల పోచారం పంచాయతీ పరిధిలోని రామచంద్రపురం వలస గ్రామం కుంజా మారయ్య – భద్రమ్మ దంపతలు ఏళ్ళ క్రితం వచ్చి అడవినే నమ్ముకొని కట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో వారికి ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఈ ఇద్దరు ఆడపిల్లల్లో చివరి అమ్మాయే ఈ కుంజా రజిత. ఈమె 1 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు చింతూరు మండలంలోని కాటుకపల్లి లిడ్స్ పాఠశాలలో చదువుకుంది. నెల్లూరులోని ఆశ్రమ పాఠశాలలో 9, 10 వ తరగతలు పూర్తి చేసింది. మంగళగిరిలోని జేకే జూనియర్ కళశాలలో ఇంటర్ చదువుకుంటూ పరుగువైపు పదును పెట్టింది. రజిత తల్లిదండ్రులు కట్టెలు అమ్ముకొని బిడ్డలను పోషించుకుంటూ జీవనం సాగించారు. తండ్రి మారయ్య మరణించడంతో వీరికి మరిన్ని కష్టాలు తోడయ్యాయి. ఈ కష్టాలను అధిగమించి అంతర్జాతీయస్థాయికి ఎదిగింది.
రజిత అడివిలో అడుగులు.. ప్రపంచ పరుగుల వైపు
అరణ్యంలో ఆడబిడ్డ అయిన రజిత అడవిలో బుడిబుడి అడుగు లు నేర్చుకొని ఆ అడుగులను పరుగుల వైపు వేసి ఇప్పుడు ప్రపంచం వైపు పరుగులు తీసింది. బాహ్యా ప్రపంచానికి రావడానికి సుమారు 10 కిలో మీటర్ల మేర కాలినడకన నడిచిన నడక ఆమెకు దోహద పడింది. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ ఎప్పుడు పరుగు పందెం జరిగి నా అక్కడ ఇట్టే వాలిపోయి పరుగుపందెంలో పాల్గోని విజయ దుందుభి మ్రోగించేది ఈ రజిత. ఇలా పరుగుపందెంలో ప్రారంభ మైన తన పరుగు అసోంలో 2019 ఏడాదిలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అధ్లెటిక్ పోటీల్లో 400 మీటర్ల పరుగు విభాగంలో విశేష ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ (వెండి పతకం), జాతీయ స్థాయిలో జరిగిన పరుగుపందెంలో ఒక రజిత, రెండు కాంస్య పతకాలను సాధించింది. ప్రస్తుతం ఖేలో ఇండియా జాతీయ క్రీడల్లో పాల్గోని అండర్ – 20 విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో రజిత 56.07 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని ప్రధమస్థానంలో నిలి చి బంగారు పతకాన్ని సాధించి తన సత్తా ను ప్రపంచ నలుమూలల చాటింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.