Thursday, November 21, 2024

స్పెషల్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ గేమ్స్‌లో భారత్‌ గోల్ఫర్స్‌కు గోల్డ్‌ మెడల్‌

స్పెషల్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ గేమ్స్‌ 2023 ఇండియన్‌ గోల్ఫర్స్‌ రణ్‌వీర్‌ సైనీ, రాహుల్‌ అగర్వాల్‌, అంకుష్‌ సాహ బృందం బంగారు పతకం కైవసం చేసుకుంది. స్పెషల్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ గేమ్స్‌లో లెవల్‌-1 గోల్ఫ్‌ ఈవెంట్‌లో ఇండియన్‌ గోల్ఫర్స్‌ అద్భుత ప్రతిభ కనబరిచారు. బెర్లిన్‌లోని అర్నాల్డ్‌ పార్మర్‌ కోర్స్‌లో నాలుగురోజులపాటు సాగిన గోల్ఫ్‌ ఈవెంట్‌లో రణ్‌వీర్‌ మరియు రాహుల్‌ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం సాధించారు. 18 షాట్ల రికార్డ్‌ -బ్రేకింగ్‌ మార్జిన్‌తో గోల్డ్‌ మెడల్‌ను చేజిక్కించుకున్నారు. వరల్డ్‌ గేమ్స్‌లో విజయవంతంగా రాణిస్తున్న అథ్లెట్స్‌లలో సైనీ కూడా ఒకరు. 17ఏళ్ల రణ్‌వీర్‌ సైనీ 2015 లాస్‌ఏంజెల్స్‌ గేమ్స్‌లో తొలి గోల్డ్‌ మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బెర్లిన్‌లో జరుగుతున్న స్పెషల్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ గేమ్స్‌లో భారత్‌ అథ్లెట్స్‌ 76 పతకాలు సాధించారు. ఇందులో 26 గోల్డ్‌, 30 సిల్వర్‌, 20 బ్రోంజ్‌ మెడల్స్‌ ఉన్నాయి. జూడోలో సుహలియా ప్రవీణ్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించి, స్పెషల్‌ ఒలింపిక్స్‌ గేమ్స్‌లో భారత్‌ అథ్లెట్లు పతకాల బోణి కొట్టారు. పవర్‌ లిఫ్టింగ్‌లో 20 మెడల్స్‌ కైవసం చేసుకున్నారు. వి హరీష్‌- సియా సరోడ్‌ 4 గోల్డ్‌ మెడల్స్‌ చేజిక్కించుకున్నారు. ఇలా అన్ని విభాగాల్లో భారత అథ్లెట్లు స్పెషల్‌ ఒలింపిక్స్‌ గేమ్స్‌లో అద్భుతంగా రాణించి, పతకాలు కైవసం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement