కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల పట్టికలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ గోల్డ్ మెడల్ సాధించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా సుధీర్ చరిత్ర సృష్టించాడు. తొలిప్రయత్నంలోనే 208 కేజీల బరువెత్తిన సుధీర్.. రెండో ప్రయత్నంలో 212 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 134.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఆరో బంగారు పతకం కైవసం చేసుకుంది.
ఇక క్రిస్టియన్ ఒబిచుకు 133.6 పాయింట్లతో సిల్వర్, 130.9 పాయింట్లతో మిక్కి యులె కాంస్యం సాధించాడు. జూన్‌లో దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ పారా పవర్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో 214 కిలోల బరువెత్తి కాంస్యం సొంతం చేసుకున్నారు. హాంగ్జూలో జరగాల్సిన ఏషియన్ పారా గేమ్స్‌కు కూడా అర్హత సాధించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.