రానున్న రోజుల్లో బంగారం ధరకు రెక్కలు రానున్నాయా? బంగారం ధరలు మరోసారి ఆశ్చర్యాన్ని కలిగించే స్థాయికి రాబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు స్పెయిన్‌కు చెందిన క్వాడిగ్రా ఫండ్ సంస్థ రానున్న ఐదేళ్లలో తులం బంగారం ధర రూ.లక్ష దాటే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ సంస్థ అంచనా ప్రకారం రాబోయే 3 నుంచి 5 సంవత్సరాలలో బంగారం ధర ప్రతి ఔన్స్‌కు 3,000 డాలర్ల నుంచి 5000 డాలర్ల వరకు ఉంటుంది. అంటే 10 గ్రాములకు రూ.78,690 నుంచి రూ.1,31,140గా ఉండనుంది.
కాగా 2020లో బంగారం ధర రూ.56వేలను తాకగా.. కొన్ని వారాలుగా బంగారం ధర రూ.47వేలుగా ఉంది. మరోవైపు, యూఎస్‌బీ గ్రూప్ వ్యూహకర్తలు ఈ ఏడాది బంగారం మరింత తగ్గుతుందని, అది రూ.44,600కి చేరుకుంటుందని చెప్పారు. ఈ క్షీణత 2022లో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే క్వాడ్రిగా ఫండ్ మేనేజర్లు మాత్రం తమ అంచనాకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించడం గమనార్హం. బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.48,034 పలుకుతోంది.
ఈ వార్త కూడా చదవండి: ఈనెల 15న మార్కెట్‌లోకి ఓలా స్కూటర్ విడుదల